నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి
నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి
నిడమనూరు మండలం వేంపాడు గ్రామంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని దామరచర్ల మండలం పుట్టలగడ్డ సర్పంచ్ రూపావత్ బాష్యా నాయక్, రూపావత్ సేవా నాయక్ శనివారం పరిశీలించారు. కాలువకు గండి పడటంతో వేలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాలువకు పడిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. Vaddepalli Kashi Ram